నేను చేయాల్సిందల్లా అత్యుత్తమంగా క్రికెట్ ఆడడమే -శ్రేయస్ 1 y ago
దేశవాళీ క్రికెట్ లో విజయం సాధించి తిరిగి జాతీయజట్టులో స్థానం సంపాదించుకున్న శ్రేయస్ ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. జట్టుకు దూరమైనప్పుడు శ్రేయస్ ఎన్నో విమర్శలకు గురయ్యాడు. నేను ఎవరికీ ఎలాంటి సందేశం పంపాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిందల్లా నాపై నమ్మకం ఉంచి అత్యుత్తమ క్రికెట్ ఆడడమే. నా కఠినశ్రమ వల్లే మళ్లీ ఇదే స్థాయిలో రాణిస్తున్నా అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.